మెహెందీని ఇలా సులభంగా తొలగించండి..

30 August 2023

పెళ్లి, పండగ వేడుక ఏదైనా మగువల చేతికి గోరింట పండాల్సిందే. నచ్చిన రంగులో మెచ్చిన డిజైన్లతో అందంగా ముస్తాబవుతుంటారు

అప్పటికి బాగానే ఉన్నా ఆ తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. మెహెందీ డిజైన్ పొట్టులా రాలి చిరాకు పుట్టిస్తుంటుంది.

ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలియక చాలా మంది తలబాదుకుంటారు. నిజానికి ఇంట్లో దొరకే ఈ చిన్నపాటి వస్తువులతో సులువుగా మెహెందీ డిజైన్ తొలగించుకోవచ్చు

ప్రతి ఇంటి వంట గదిలో నిమ్మకాయలు తప్పకుండా ఉంటాయి. ముందుగా ఒక నిమ్మకాయ తీసుకుని రెండు భాగాలుగా కట్ చేయాలి. ఆ తర్వాత నిమ్మకాయ రసాన్ని నేరుగా చేతులపై పిండుకోవాలి

చేతికున్న మెహెందీ మొత్తాన్ని తొక్కతో రుద్ది ఐదు నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుని చూడండి. డిజైన్ సులభంగా వదిలిపోతుంది

అలాగే పళ్లు తోముకునే టూత్ పేస్ట్ కూడా మెహెందీ తొలగించడంతో చక్కగా పనిచేస్తుంది. టూత్‌ పేస్ట్‌ని మెహెందీ ఉన్న చేతికి పలుచని పొరలా రాసుకోవాలి

బాగా ఆరిన తర్వాత  తడి బట్టతో తుడిచేయాలి. టూత్‌పేస్ట్‌లోని రసాయనాలు మెహెందీని సులువుగా తొలగించడంలో సహాయపడుతుంది

బేకింగ్‌ సోడాలో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్‌లా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెహిందీ ఉన్న చేతులకు పూసుకుని5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరి