గోంగూర తింటే ఈ సమస్యలన్నీ దూరం..

Jyothi Gadda

08 July 2024

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో గోంగూరని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఆకుకూరతో పప్పు, పచ్చడి, గోంగూర రైస్ అంటూ ఎన్నో రకాలు చేసుకుని తింటారు. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. 

గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

గోంగూరలో క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయి. కాబట్టి, ఈ గోంగూరని హ్యాపీగా తినొచ్చు. దీనిని పులిహోరలా చేసి తినొచ్చు, పచ్చడి, పప్పు ఎలా అయినా తినొచ్చు.

ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. గోంగూరని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. డ్యామేజ్ అయిన జుట్టుకు చికిత్సలా పనిచేస్తుంది.

గోంగూర ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన పోషకం. విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

గోంగూర ఆకులలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. పైగా ఫైబర్ చాలా ఉంటుంది. బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక.

గోంగూర ఆకులలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. పైగా ఫైబర్ చాలా ఉంటుంది. బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక.

గోంగూర ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.