ఆ జాబితాలో మ‌సాలా ఛాయ్ ఘనత.. మరికొన్ని ఆహారాలకి కూడా..

TV9 Telugu

18 January 2024

తాజాగా మ‌సాలా ఛాయ్ ప్ర‌పంచంలోనే ఉత్త‌మ‌మైన నాన్ ఆల్క‌హాలిక్ పానీయాల జాబితాలో రెండో స్ధానంలో నిలిచింది.

ఇటీవల సర్వే చేసిన టేస్ట్ అట్లాస్ ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్ లో మ‌సాలా ఛాయ్‌కు రెండవ స్ధానం ద‌క్కింది.

మ‌న‌లో చాలా మందికి ఉద‌యాన్నే టీ తాగ‌నిదే రోజు ప్రారంభం కాదు. మ‌సాలా చాయ్ వింట‌ర్‌లో వేడిగా గొంతులో దిగుతూ రోజంతా ప‌నిచేసే శ‌క్తినీ, ఉత్సాహాన్నీ ఇస్తుంది.

బ్లాక్ టీ, పాల‌తో పాటు అల్లం, మిరియాల పొడి, యాల‌కులు, ల‌వంగాలు, దాల్చిన‌చెక్క మిశ్ర‌మంతో మసాలా చాయ్‌ను తయారుచేస్తారు.

మెక్సికోకు చెందిన అగాస్ ఫ్రెస్కాస్ ఈ జాబితాలో ఫ‌స్ట్ ర్యాంక్‌లో నిలిచింది. పండ్లు, పూలు, కుకుంబ‌ర్, షుగ‌ర్‌, వాట‌ర్‌తో ఈ పానీయాన్ని త‌యారు చేస్తారు.

మన దేశంలో చాలామంది ఇష్టంగా తాగే మ్యాంగో ల‌స్సీ ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ డైరీ పానీయంగా ఘ‌న‌త సాధించింది.

బిర్యానీ కోసం ఎక్కువగా వినియోగించే బాస్మ‌తి రైస్ ప్ర‌పంచంలో అత్యుత్తమ రైస్‌గా అరుదైన ఘ‌నత‌ను సొంతం చేసుకుంది.

ఇంకా ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని ప్రముఖ ఆహారాలు, పానీయాలు టేస్ట్ అట్లాస్ ప్ర‌క‌టించిన జాబితాలో ఉన్నాయి.