పసుపుతో ఎన్నో  రోగాలకు చెక్ పెట్టండి

TV9 Telugu

05 June 2024

ప్రతి ఇంట్లో ప్రతి రోజు వంటల్లో పసుపును వాడుతుంటాం. అంతేకాదు పసుపులో  ఎన్నో రోగాలను తగ్గించే ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నాయి.

ఈ పసుపుతో ద్వారా ఎన్నో రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం

పసుపు సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. కరోనా లాంటి వ్యాధుల వంటి వాటిలో కూడా పసుపు ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే గుణాలున్నాయి. 

తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం పసుపు నీళ్ళు క్రమం తప్పకుండా తాగడం వల్ల టైప్2 డయాబెటిస్‌ను నివారించవచ్చని తేలింది.

పసుపులో ఉండే కుర్కుమిన్ హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, మతిమరుపు వంటి లక్షణాలను నివారించవచ్చు. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె జబ్బులని కూడా దరిచేరనివ్వవు. 

పసుపులో కేన్సర్‌తో పోరాడే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. కేన్సర్‌కి సంబంధించిన ట్యూమర్ల పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది.