TV9 Telugu
ఫ్లైట్‌ను లగ్జరీ విల్లాగా మార్చేసిన వ్యక్తి
23 Febraury 2024
రష్యాకు చెందిన ఫెలిక్స్ డెమిన్ ఓ పాతబడిన బోయింగ్ 737 విమానాన్ని కొని దాన్ని అద్భుతమైన ప్రైవేట్ విల్లాగా మార్చేశాడు.
ఈ ఫ్లైట్ విల్లాను ఇండోనేషియాలోని బాలిలో ఉన్న న్యాంగ్ న్యాంగ్ బీచ్ సమీపంలో ఏర్పాటు చేశాడు ఆ వ్యక్తి.
ప్రపంచవ్యాప్తంగా కొందరు అదృష్టవంతులు తమ కలల్ని ప్రజలు అందరిలో ప్రత్యేకంగా ఉండేలా సాకారం చేసుకుంటారు.
ఇటీవల కొందరు పాతబడ్డ కార్లు, బస్సులను ఇల్లుగా మార్చుకొని అందులోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు.
ఈ ఫ్లైట్ విల్లాలో రెండు పడకల గదులు, బార్, లివింగ్ రూమ్, ఇన్ఫినిటీ పూల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. కాక్‌పిట్‌ను ఓ పెద్ద బాత్‌రూమ్‌లా మార్చేశాడు.
విమానంలోని ప్రతి స్థలాన్ని ఉపయోగించి తనకు నచ్చినట్లు బెస్ట్ ఇంటీరియర్‌తో ఎంతో అందంగా తీర్చిదిద్దాడు.
ఈ ప్లేన్ విల్లాలోని ప్రత్యేకతలు, ఆశ్చర్యపరిచే విషయాలన్నింటినీ వివరిస్తూ హోమ్‌టూర్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వ్యక్తి మాత్రం తన కలలపై ఎలాంటి పరిమితులు విధించినట్లు లేడు అంటూ కామెంట్లు పెడుతూ ఈ ఫ్లైట్ విల్లాను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి