గుమగుమలాడే పుట్టగొడుగులు కూర మీ కోసం..

TV9 Telugu

13 May 2024

పుట్టగొడుగులను ఇంగ్లీషులో మష్రూమ్స్ అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు.

ఇందులో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు. ఇవి మాంసాహారముతో సమానము.

పుట్ట గొడుగుల కర్రీ కోసం పుట్ట గొడుగులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, కొత్తిమీర, నూనె, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు కావాలి.

పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరగాలి. మసాలా కోసం తీసుకున్న వాటిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని ముందుగా పుట్టగొడుగులను కొంచెం సేపు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఆ నూనెలో ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి.

తర్వాత మసాలా ముద్ద వేసి బాగా వేయించి తర్వాత పక్కన పెట్టుకున్న పుట్ట గొడుగులు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి.

అనంతరం కప్పు నీరు పోసి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించితే సరిపోతుంది.