హెల్దీ ఫిష్ పచ్చడి.. మీ ఇంట్లలో ఈజీగా సిద్ధం.. 

TV9 Telugu

21 July 2024

ఫిష్ పికిల్‌కి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మాసాలా, కరివేపాకు, నిమ్మరసం, జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు, ఆయిల్.

చేపల ముక్కలను ముందుగా శుభ్రం చేసుకోని ఒక గిన్నెలో ఉప్పు వేసి కలిపి.. ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి.. అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేయించాలి.

ఆ తర్వాత ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాక.. పక్కన పెట్టిన చేప ముక్కలు వేసి వేయించాలి.

చేప ముక్కలు రెండు వైపులా బాగా వేగాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

ఇది వేగాక చేప ముక్కల్లో వేసి కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి వేయించి చేపల మిశ్రమంలో వేయాలి.

చివరగా ఇందులో తాజా నిమ్మరసం పిండి బాగా కలిపి మూత గట్టిగా పెట్టి దాన్ని మూడు రోజుల పాటు నిల్వ చెయ్యాలి.

ఆ తర్వాత మూత తీసి తింటే ఫిష్ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.