అవిసె గింజలతో పరాటా.. రుచి చూస్తే ఆహా అనాల్సిందే..
TV9 Telugu
02 June 2024
అవిసె గింజలతో పరాటా తింటే బరువు తగ్గడమే కాకుండా కొత్త రుచిని కూడా తెలుసుకోవచ్చు. అవిసె గింజలు ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
వీటిలో పుష్కలంగా ఉన్న ఫైబర్ బరువును నియంత్రిస్తుంది. అవిసె గింజలు తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి పొందవచ్చు. ఇవి హృదయాన్ని జబ్బుల నుంచి కాపాడతాయి.
అవిసె గింజల పరాటా తయారీకి కావలిసిన పదార్దాలు అవిసె గింజలు, గోధుమ పిండి, బెల్లం తురుము, పాలు, నూనె, దేశీ నెయ్యి, ఉప్పు.
ముందుగా అవిసె గింజలను బాణలిలో వేసి బాగా వేయించి చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిని ఒక డిష్‌లో వేసి, తురిమిన బెల్లం, కొద్దిగా పాలు వేసి బాగా కలపాలి. ఈ విధంగా మీ అవిసె గింజల స్టఫ్ పరాటా మధ్యలో కూరటానికి సిద్ధంగా అవుతుంది.
ఇప్పుడు మరో పాత్రలో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి కొద్దిసేపు అలానే మూతపెట్టి ఉంచాలి.
తర్వాత గోధుమ పిండిని బాల్‌గా చేసి అందులో ఫ్లాక్స్ సీడ్ స్టఫింగ్‌తో నింపి బాగా చుట్టి పాన్‌పై కొద్దిగా నెయ్యి వేసి రాటాను చేసుకోవాలి.
ఈ పరాటాను లేత బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించాలి. ఇప్పుడు పాన్ నుండి తీసి చట్నీ లేదా సాస్ తో సర్వ్ చేయడమే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి