గుమ్మడికాయతో పూరి.. చేసుకొని తింటే.. రుచి.. ఆరోగ్యం కూడా..
Prudvi Battula
Images: Pinterest
11 November 2025
గుమ్మడికాయ విటమిన్లు, ఫైబర్, తీపి రుచితో నిండి ఉంటుంది. దీనితో చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.
గుమ్మడికాయ
ఉడికించిన గుమ్మడికాయ గుజ్జు 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పసుపు 1 చిటికెడు, నూనె, అవసరమైనంత ఉప్పు కావాలి.
కావలిసిన పదార్దాలు
ముందుగా గుమ్మడికాయ తొక్క తీసి, గింజలు తీసి నీళ్లు కలపకుండా మరిగించాలి. ఇది బాగా మెత్తగా పేస్ట్ లా చేయాలి.
రెసిపీ
ఒక ప్లేట్ లో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, గుమ్మడికాయ గుజ్జు వేసి, నీళ్లు చల్లి, పూరీ లాగా పిసికి కలుపుకోవాలి.
పిండి మెత్తగా కలపండి
పిసికిన పిండిని ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోండి. సన్నగా కాకుండా మందంగా చుట్టండి. అప్పుడే పూరీలు భాగా వస్తాయి.
ఉండలుగా చుట్టండి
ఒక పాన్ లో నూనె పోసి, అది వేడి అయ్యాక, పిండిని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి తీసేస్తే గుమ్మడికాయ పూరి రెడీ.
వేయించి తీసుకోండి
గుమ్మడికాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.
ప్రయోజనాలు
ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డైట్ పాటించే వారికి ఇది చాలా మంచి ఎంపిక. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
కేలరీలు
మరిన్ని వెబ్ స్టోరీస్
7 డేస్.. 7 జ్యువెలరీ.. ఏ రోజు ఎలాంటి నగలు ధరించాలంటే.?
ఇంట్లో అందరు మెచ్చేలా.. టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఎలా చెయ్యాలంటే.?
కాటేసే ముందు పాములు హెచ్చరిస్తాయా.?