14 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
మఖానా ఆరోగ్యానికి వరం లాంటిది. ఇది చాలా తేలికైన చిరుతిండి. ప్రజలు వీటిని ఎంతో ఉత్సాహంతో తింటారు.
ఐరన్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, మినరల్, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం మొదలైన ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి.
ఇది పురుషులకు ఔషధం కంటే తక్కువ కాదని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ డింపుల్ జాంగ్రా అంటున్నారు. దీని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
మీ కండరాలను బలోపేతం చేసుకోవలనుకుంటే.. రోజువారీ అల్పాహారం సమయంలో కాల్చిన మఖానాను తినండి.
మఖానాలో సోడియం, సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది
మానసిక ఒత్తిడిని తొలగించడంలో కూడా మఖానా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది
మఖానా తినడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా బాగా ఉంచుతుంది.