పెళ్లిళ్లు, పార్టీలు, ఫంక్షన్లు వేడుక ఏదైనా అందంగా మేకప్ చేసుకుని మురిసిపోతుంటారు మగువలు. రకరకాల కాస్మటిక్స్‌తో మోమును ముస్తాబు చేసుకుంటూ ఉంటారు
మరి ఆ తర్వాత మేకప్‌ను తొలగించడానికి టీష్యూతో పైపైన ఏదో మమ అనిపించేస్తుంటారు. లేదంటే ఒక్కోసారి అలానే నిద్రపోతుంటారు. ఇలా చేయడంవల్ల మొటిమల వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు
మేకప్ సరిగ్గా తొలగించకుంటే చర్మం త్వరగా పాడైపోతుందట. మరైతే ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మరేం పర్వాలేదు ఈ కింది టిప్స్ ఫాలో అయ్యారంటే ఈ స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది
తేనె సహజమైన మేకప్ రిమూవర్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది కూడా. రెండు స్పూన్ల తేనె తీసుకుని దానిలో కాటన్ బాల్‌ను ముంచి ముఖంపై 5 నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి
ఇలా ముఖం, మెడ భాగం అంతా తేనె ఆపై చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి. అలాగే పచ్చిపాలల్లో విటమిన్లు, ప్రొటీన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మేకప్‌నూ తొలగిస్తాయి
పాలల్లో కాటన్ బాల్ ముంచి పది నిమిషాలు పాటు మర్దన చేసి, ఆపై నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పాలు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేసి మెరుపును అందిస్తాయి
అలాగే ముఖానికి ఆవిరి పట్టి కూడా మేకప్‌ను సులభంగా తొలగించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. పదినిమిషాలు ఆవిరిపట్టి, ఆ తరవాత కాటన్ క్లాత్‌తో ముఖం తుడుచుకుంటే సరి
ఆవిరి వల్ల పట్టిన చెమటతో పాటు మురికి సమూలంగా పోతుంది. ఫలితంగా మొటిమలు రాకుండా ఉంటాయి. దోసకాయ రసం కూడా సహజ మేకప్ రిమూవర్‌గా ఉపయోగిస్తే సహజ క్లెన్సర్‌గా పనిచేస్తుంది