సాధారణ షాంపూని యాంటీ డాండ్రఫ్ షాంపూగా ఈ విధంగా మార్చండి
TV9 Telugu
చలికాలం లేదా అనేక కారణాల వల్ల జుట్టులో డాండ్రప్ సమస్య పెరిగి హెయిర్ ఫాల్ మొదలవుతుంది. దీనికోసం యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడుతుంటారు.
ఇంట్లో ఉండే వస్తువులతో సాధారణ షాంపూను సులభంగా మంచి యాంటీ డాండ్రఫ్ షాంపూగా మార్చుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
నార్మల్ షాంపూలో ఒక చెంచా నిమ్మరసం కలిపి సున్నితంగా మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల మంచి ఫలితం వస్తుంది.
వేప నూనె లేక పొడి రూపంలో మనకు లభిస్తుంది. నేరుగా చెట్టు నుంచి కోసి ఉడికించిన నీటితో తలస్నానం చేసినా దురద పోతుంది.
వేపనూనెను సాధారణ షాంపూలో కలపండి. సింపుల్ గా అది యాంటీ డాండ్రఫ్ షాంపూ అయిపోతుంది. ఇది నేచురల్ రెమిడీ కూడా.
టీ ట్రీఆయిల్ లో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రు సమస్యను సమర్థవంతంగా వదిలిస్తుంది.
మీ సాధారణ షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీఆయిల్ కలిపి జుట్టుపై మసాజ్ చేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో తలస్నానం చేసుకోండి.
కలబంద.. చుండ్రు సమస్యకు కలబంద చాలా మంచి రెమిడీ. ఒక స్పూన్ కలబంద, ఒక స్పూన్ షాంపూ ఇలా సమపాళ్లలో తీసుకుంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ రెడీ అయినట్లే.