మెగ్నీషియం లోపిస్తే ఇంత ప్రమాదమా?

14 August 2024

TV9 Telugu

TV9 Telugu

ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందా? అలసటగా అనిపిస్తుందా? ఉన్నట్లుండి చేతులు, కాళ్ళు మొద్దుబారిపోతున్నాయా? ఇవి మెగ్నీషియం లోపానికి సంకేతాలు కావచ్చు

TV9 Telugu

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రోటీన్లు, విటమిన్లతో పాటు వివిధ మినరల్స్ కూడా చాలా ముఖ్యం. అందులో ఒకటి మెగ్నీషియం

TV9 Telugu

మానసిక ఆరోగ్యం, ఎముకలను బలంగా ఉంచడానికి, నాడీ వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి మెగ్నీషియం చాలా ముఖ్యమైనది

TV9 Telugu

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే మతిమరుపు, చేతులు - కాళ్ళలో తిమ్మిరి, కండరాల ఉద్రిక్తత, అలసటకు కారణమవుతుంది

TV9 Telugu

మెగ్నీషియం లోపం హృదయ స్పందన రేటు అసాధారణ రేటుతో పెరగడానికి లేదా తగ్గడానికి కారణమవుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది

TV9 Telugu

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే మెదడు సరిగా పనిచేయదు. ఫలితంగా మానసిక ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. గందరగోళం, స్పృహ కోల్పోవడం, ఒక్కోసారి కోమాలోకి వెళ్లడం కూడా సంభవించవచ్చు

TV9 Telugu

నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన ఆహారం తీసుకోకపోవడం, పోషకాహార లోపం వల్ల శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి

TV9 Telugu

గుమ్మడికాయ గింజలు, పాలకూర, కోకో, డార్క్ చాక్లెట్, బాదంపప్పులలో తగినంత మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. వీటిని ఆహారంలో తప్పక చేర్చుకోవాలి