జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహాలుగా చెప్పుకునే రాహు, కేతువు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు 18 నెలల పాటు సమయం పడుతుంది. అంటే ఏడాదిన్నర కాలం.
అయితే ఈ గ్రహాలు సంచారం చేయడం వల్ల దాదాపు అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. రాహువు గ్రహం 2023 సంవత్సరం అక్టోబర్ 30న మీన రాశిలోకి, కేతువు గ్రహం కూడా రాశి సంచారం చేసింది.
అయితే ఈ రెండు గ్రహాలు 2025 సంవత్సరంలో సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి.
శాస్త్రం ప్రకారం రాహువు కేతువు గ్రహాలను భౌతిక సుఖానికి సూచిగా భావిస్తారు. అందుకే ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉన్న రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మిథున రాశివారికి ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. కుటుంబ జీవితంలో కూడా సంతోషం, పనుల్లో విజయాలు సాధిస్తారు.
మకర రాశివారికి రాహువు, కేతువు గ్రహ సంచారాల కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. కొన్ని సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
మకర రాశివారికి ఈ సంచారాల కారణంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లభించడమే కాకుండా కెరీర్ జీవితంలో అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు. అదృష్టం రెట్టింపు అవుతుంది. జీవితంలో ఏది కావాలనుకున్న సాధిస్తారు.
రాహు-కేతువు సంచారాల కారణంగా కుంభ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. భౌతిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి.ఆనందం రెట్టింపు అవుతుంది.