చెన్నై టూ అరుణాచలం.. తక్కువ ధరకే టూర్ ప్యాకేజీ.. 

TV9 Telugu

09 July 2024

చెన్నై టూరిజం వారు అరుణాచలం వెళ్లాలనుకునేవారికోసం కొత్తగా టూర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ టూర్ ధర ఒక్కొక్కరికి రూ.1850.

అరుణాచలం దర్శనానికి పురుషులు అయితే చొక్కా/పాంట్‌తో దోతీ ధరించాలి. మహిళలు చీర లేదా దుపట్టాతో చుడీదార్ ధరించాలి.

ఉదయం 8 గంటలకు చెన్నై టూరిజం కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరుతుంది. మధ్యలో 10:00 గంటలకు మథురాంతంకంలో అల్పాహారం చేస్తారు.

12 గంటలకు తిరువణ్ణామలై తమిళనాడు టూరిజం హోటల్‌కి చేరుకుంటారు. ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుంది.

3 గంటలకు అరుణాచలం ఆలయానికి నడక మార్గం ద్వారా దర్శనానికి వెళ్తారు. దర్శనం తర్వాత 4 గంటలకి గిరివాలం పర్యటన.

రాత్రి 8 గంటలకు హోటల్‌లో భోజనం చేసి తిరిగి చెన్నైకి బయలుదేరతారు. దీంతో అరుణాచలం టెంపుల్ టూర్ ముగిస్తుంది.

చెన్నై, బెంగళూరుతో పాటు హైదరాబాద్ లాంటి మరికొన్ని ఇతర సమీప నగరాల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇది 180 కి.మీ. తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ నుంచి 2 కి.మీ దూరంలో ఉంది.