మఖానా అనేది యూరియాల్ ఫెరోక్స్ అంటే తామర మొక్కల నుండి సేకరించే విత్తనాలు. ఇవి పోషకాలకు పవర్‌హౌస్ లాంటివి. వీటిలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి.
మఖానాలో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్‌తో పాటు క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి.
తామర గింజల్లో కొలెస్ట్రాల్, సోడియం, సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫూల్ మఖానా మీ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.
మఖానాతో గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్ సమస్యలను నిరోధిస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. పూల్ మఖానాతో కూరలు, ఖీర్, స్వీట్స్ తయారు చేస్తారు.
మఖానాలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. మఖానా తినడం వల్ల రక్తంలో చక్కెర కంట్రోల్‌లో ఉంటుంది.
కీళ్ల సమస్యలతో పాటు దంత సమస్యలతో బాధపడేవారు తామర గింజలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.
తామర గింజలను అనేక సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యలు, దీర్ఘకాలిక విరేచనాలు, అధిక ల్యుకోరియా, ప్లీహము హైపోఫంక్షన్‌తో సహా వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు.
ఉదయం పూట ఖాళీ కడుపుతో 4-5 మఖానాలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 25 నుంచి 30 గ్రాముల కంటే ఎక్కువ మఖానా తినడం మంచిది కాదు. అతిగా తింటే అనర్థమే.!