వేపతో డయాబెటిక్ సహా ఈ వ్యాధులకు చెక్..

11 October 2023

వేప ఆకులు, కాండం, కాయతో డయాబెటిక్ సహా అనేక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఈ ప్రత్యేక వెబ్‌ కథనంలో తెలుసుకుందాం.

వేపతో బోలెడు ప్రయోజనాలు..

వేపలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఇండియన్ లిలక్, మార్గోసా అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వేప ఆకు ప్రయోజనాలు

ప్రజలు శాతాబ్ధాల తరబడి వేపను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సలలో వేప కూడా ఒక భాగం. ఆయుర్వేద చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.

ఆయుర్వేద చికిత్సలో

వేప రుచి చేదుగా ఉంటుందని మందరికీ తెలిసిందే. కానీ, ఈ చేదులోనే మన ఆరోగ్యం దాగుంది. దీనిని తీసుకోవడం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చేదు

వేపలో ఫ్లేవనాయిడ్స్ వంటి రసాయనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌తో పోరాడుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. 

క్యాన్సర్ నివారణ

వేపను మధుమేహం చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో వేప చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వేపను తీసుకోవడం వలన మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

డయాబెటిక్

వేప ఆకులు సీరం మార్కర్ ఎంజైమ్‌లను స్థీకరించడం ద్వారా రసాయనాల వల్ల కాలెయానికి జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి. అందుకే వేప ఆకులను తినడం గానీ, రసం తాగడం గానీ చేయాలంటారు.

కాలేయం

ఇది శరీరంలో కొలెస్ట్రాల్, రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

గుండె ఆరోగ్యం

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు వేప పుల్లతో పళ్లను శుభ్రం చేసుకుంటారు. వేపతో పళ్లు తోముకోవడం ద్వారా నోరు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

దంతాల శుభ్రత