ఈ లక్షణాలు ఉంటే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే..

March 15, 2024

TV9 Telugu

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్‌) ఒకటి. శరీరాన్ని విష రహితం చేయడంలో కాలేయం పాత్ర కీలకం. శరీరంలో చేరే హానికర కారకాలను కాలేయం ఎప్పటికప్పుడు శుద్ధిచేస్తుంది

జీవక్రియల నిర్వహణలో, పోషకాల నిలువలో లివర్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఆల్కహాల్ తాగేవారిలో కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి

అలాగే వైరల్ ఇన్ఫెక్షన్‌లు, ఊబకాయం, జన్యుపరమైన కారణాలవల్ల కూడా ఆల్కహాల్‌ అలవాటు లేని వారిలో నాన్‌ ఆల్కహాల్‌ కాలేయ సమస్యలు తలెత్తుతుంటాయి

కాలేయంలో అనారోగ్యానికి గురైనప్పుడు మనలో కనిపించే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు తలెత్తుతుంది

కాలేయం సమస్యతో బాధపడేవారిలో ప్రారంభ సంకేతాలు నిరంతర అలసట, బలహీనత. అలాగే మూత్రం రంగు కూడా మారుతుంది. మూత్రంలో బైలిరుబిన్ ఉండటం వల్ల గోధుమ రంగులోకి మారుతుంది

అలాగే మలం రంగు కూడా మారుతుంది. మలం లేత రంగులో లేదంటే మట్టి రంగులో ఉందంటే కాలేయంలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. కాలేయంలో సమస్యవల్ల పిత్త పరిమాణం తగ్గి మలం రంగు మారుతుంది

ఉదరం పైభాగంలో ఎపిగాస్ట్రిక్‌ నొప్పి వస్తుంది. కాలేయం వాపు, విస్తరణకు సంకేతం. కొవ్వు పదార్ధాలున్న ఆహారం తిన్నప్పుడు ఈ నొప్పి అధికంగా ఉంటుంది

సిర్రోసిస్ లాంటి కాలేయ సమస్యలతో ద్రవాల నిలుపుదల కారణంగా కాళ్ల వాపు సంభవించవచ్చు. శరీరంలో ద్రవం పేరుకుపోయి పాదాలు, చీలమండల్లో వాపు తలెత్తుతుంది. అలాగే అరిచేతులు, అరికాళ్లపై ఎక్కువగా దురదగా అనిపిస్తుంది