లివర్ పాడయితే గోర్లను చూసి ఇట్టే పసిగట్టవచ్చు..!

April 19, 2024

TV9 Telugu

శరీర అవయవాల్లో అతి ముఖ్యమైన అవయవం లివర్. ఎప్పటి కప్పుడు లివర్‌ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు

అయితే వైద్య పరీక్షలు లేకుండానే లివర్‌లో సమస్య ఉంటే కొన్ని లక్షణాల ద్వారా సులభంగా గుర్తించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చేతి వేళ్ల గోర్లు చూసి లివర్ ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చట 

లివర్ పాడవడం అంటే చాలా సీరియస్ సమస్యగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే లివర్‌లో సమస్య ఏర్పడితే ఆ ప్రభావం అన్ని అవయవాల పనితీరుపై పడుతుంటుంది

శరీరంలో విష పదార్ధాలు బయటకు తొలగించేది లివర్ ఒక్కటే. జీర్ణక్రియ, గుడ్ కొలెస్ట్రాల్, రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో కూడా లివర్ పాత్ర చాలా కీలకం. అందుకే లివర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి

వాస్తవానికి శరీరంలో ఏ ఇతర అవయవానికి లేనట్టుగా లివర్‌కు రీ జనరేటెడ్ సామర్ధ్యం ఉంటుంది. కానీ దీర్ఘకాకాలంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలికి అలవాటు పడితే మాత్రం లివర్ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది

గోర్లలో కొన్ని సంకేతాల ద్వారా లివర్ ఆరోగ్యంగా ఉందో లేదే పసిగట్టవచ్చు. లివర్ చెడిపోతే గోర్లు బలహీనంగా మారిపోయి గోర్లు చివర్లు త్వరత్వరగా విరిగిపోతుంటాయి

గోర్ల ఆకారంలోనూ మార్పు వస్తుంది. గోర్లు అణిగిపోయి, చర్మంలో ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తాయి. లివర్ పాడయితే గోర్ల రంగులో మార్పు స్పష్టంగా కన్పిస్తుంది. సహజసిద్ధమైన రంగును కోల్పోయి పసుపుగా మారతాయి

గోర్లపై గోధుమ లేదా పసుపు రంగు గీతలు కన్పిస్తాయి. అలాగే లివర్ పాడయితే చర్మం పసుపుగా మారడం, కళ్లు తెల్లబడటం, కడుపులో నొప్పి, కాళ్లు, మడమల్లో నొప్పి, చర్మం దురద, అలసట, వికారం, వాంతులు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి