మౌత్‌వాష్‌ వాడితే క్యాన్సర్ వస్తుందా?

19 June 2024

TV9 Telugu

TV9 Telugu

నోటి దుర్వాసనను నివారించేందుకు, ఫ్రెష్‌గా ఉండేందుకు లిస్టరిన్ మింట్‌ మౌత్ వాష్‌ను తరచుగా వినియోగిస్తున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి

TV9 Telugu

ప్రముఖ కంపెనీకి చెందిన ఈ లిక్విడ్‌ మౌత్‌ వాష్‌ వాడితే కేన్సర్‌ ప్రమాదం పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది

TV9 Telugu

రోజూ లిస్టరిన్ కూల్ మింట్‌ వాడటం వల్ల బాక్టీరియా నోట్లో పెరుగుతుందని ఫలితాంగా ‘ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్‌’ స్థాయిలు ఎక్కువవుతాయని తెలిపింది

TV9 Telugu

నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్‌ఫెక్షన్లు కూడా లిస్టెరిన్ కెమికల్ కారణంగా వచ్చే అవకాశం ఉందని  పరిశోధనలో తేలిందన్నారు.  మౌత్‌ ఫ్రెష్‌నర్‌లోని రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా  బాగా పెరిగిపోతుందని, ఫలితంగా  పీరియాంటల్ వ్యాధులు, అన్నవాహిక, కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదం పెరుగుతుందట

TV9 Telugu

అయితే తమ అధ్యయనం లిస్టరిన్‌ను మాత్రమే పరీక్షించినప్పటికీ, ఇతర ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌లతో కూడా ముప్పు ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు

TV9 Telugu

వీటివల్ల తలెత్తే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు  కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలు, సెల్యులార్ మార్పులు, డీఎన్‌ఏ ఉత్పరివర్తనాలకు దారితీసి, చివరికి ప్రాణాంతం కూడా కావచ్చు

TV9 Telugu

మౌత్ వాష్‌లు ఎందుకు ప్రమాదం అంటే..సాధారణంగా మౌత్‌వాష్‌లలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఇందులో ఉంటుంది

TV9 Telugu

ఇలాంటి వాటిని  నిత్యం వాడటం వల్ల నోటి లోపలి చర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు వస్తాయి. ఇది నోటి కేన్సర్‌ ముప్పును కూడా  పెంచుతుంది