బరువు తగ్గాలనుకునే వారు నారింజ పండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
జామకాయను ఆహారంలో బాగం చేసుకుంటే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జామకాయ వల్ల మలబద్ధకం సమస్య తగ్గి, జీర్ణక్రియ మెరుగవుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు సీతాఫలాన్ని కూడా డైట్‌లో భాగం చేసుకోవాలనిని నిపుణులు సూచిస్తున్నారు. సీతాఫలం వల్ల మలబద్ధకం దూరమై, బరువు తగ్గుతారని చెబుతున్నారు.
ఫైబర్ కంటెంట్‌కు పైనాపిల్ పెట్టింది పేరు. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ పొట్టలోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో పొట్ట తగ్గుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దానిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిమ్మ రక్తాన్ని శుద్ధిచేస్తుంది, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ కచ్చితంగా అరటి పండు తీసుకోవాలి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం శరీరానికి శక్తినిచ్చి బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.
యాపిల్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్, నీటి శాతం బరువు తగ్గడంతో ఉపయోపడుతుంది. యాపిల్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే ఇట్టే బరువు తగ్గొచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.