అతిగా చక్కెర ఉండే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు చక్కెరను తగ్గించాలి.
ఇక కాఫీ తాగితే మెదడు ఉత్తేజం చెంది యాక్టివ్‌గా మారుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ దీర్ఘకాలంగా కెఫిన్ వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక కొవ్వు ఉండే ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వు మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
మద్యం సేవిస్తే కాసేపు రిలాక్స్ కలిగిన భావన కలుగుతుంది. అయితే దీర్ఘకాలంలో మాత్రం మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల బారినపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారం కూడా మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఈ ఫుడ్‌కు దూరంగా ఉండడమే బెటర్.
ఇదిలా ఉంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అరటిపండులో ఉండే పొటాషియం మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతీ రోజూ క్రమంతప్పకుండా అరటి పండును తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం