TV9 Telugu

09 March 2024

రోజూ పండ్లు తింటే ఇన్ని లాభాలా..? 

పండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఆపిల్, అరటిపండు, పుచ్చకాయ, బెర్రీలు, నారింజ వంటి పండ్లు గుండెను రక్షిస్తాయి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం గుండెను సంరక్షిస్తాయి. 

డయాబెటిస్‌కు చెక్‌పెట్టడంలో కూడా పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆపిల్‌, అవకాడో, చెర్రీ, నారింజ వంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్‌ వ్యాధి దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. 

క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా నారింజ, టాన్జేరిన్‌ వంటి పండ్లలో ఉండే హెపాటోప్రొకెక్టివ్‌ లక్షణాలు వల్ల క్యాన్సర్‌ను నివారించడంలో ఉపయోగపడుతాయి.

రక్తపోటును నియంత్రించడంలో కూడా పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా లభించే అరటిపండ్లు, పుచ్చకాయలు, పియర్, మామిడి వంటి వాటిని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. 

విటమిన్‌ సీ ఎక్కువగా లభించే పండ్ల ద్వారా మూత్రపిండాల్లో వచ్చే రాళ్లను నివారించవచ్చు. ముఖ్యంగా సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే ఈ మేలు జరుగుతుంది. 

పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాల్షియం, విటమిన్‌ కే ఉన్న పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. 

అయితే కొన్ని రకాల పండ్లు, ముఖ్యంగా సిట్రస్‌ జాతికి చెందిన వాటిని అన్నం తీసుకున్న వెంటనే తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల కడుపులో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.