లిచీ, స్ట్రాబెర్రీల్లో ఏది ఆరోగ్యానికి బెస్ట్.. తెలుసుకోండి.. 

08 June 2024

TV9 Telugu

Pic credit - getty

స్ట్రాబెర్రీ, లిచీ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక పోషకాలు వీటిల్లో అధికంగా ఉంటాయి. 

ఆరోగ్యానికి మేలు

లీచీ, స్ట్రాబెర్రీ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారని సీనియర్ డైటీషియన్ పాయల్ శర్మ చెప్పారు.

రెండింటిలో ఏది బెస్ట్ ? 

లిచీ కంటే స్ట్రాబెర్రీలో తక్కువ చక్కెర, కేలరీలు ఉంటాయి. ఐరన్, ఫైబర్, కాల్షియం, జింక్, పొటాషియం, విటమిన్ బి9 ఇందులో పుష్కలంగా లభిస్తాయి.

 పోషకాలు

డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు స్ట్రాబెర్రీలను తినవచ్చు. ఇవి తక్కువ కార్బోహైడ్రేట్లు , క్యాలరీలను కలిగి ఉంటాయి. కనుక  రక్తంలో షుగర్ లెవెల్ పెరగకుండా చేస్తుంది. 

మధుమేహం

స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక మలబద్ధకం చికిత్సలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.   

మలబద్ధకం

కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు స్ట్రాబెర్రీలో ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

ఎముకల బలోపేతానికి 

స్ట్రాబెర్రీలలో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇవి మంచి జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. బరువు నియంత్రణకు ఇది గొప్ప పండు స్ట్రాబెర్రీ

బరువు నియంత్రణకు