ఆహా! అరిటాకు భోజనం.. ఆహారంలో విషం కలిస్తే ఇట్టే పసిగట్టొచ్చు

24 September 2024

TV9 Telugu

TV9 Telugu

వేడివేడి అన్నం... అరిటాకులో వడ్డిస్తే వచ్చే పరిమళం మన జ్ఞాపకాల్ని ఎక్కడికో లాక్కెళ్లిపోతుంది.. అదొక్కటే కాదు. ఎన్నో ఆరోగ్య రహస్యలు కూడా ఇందులో దాగి ఉన్నాయి

TV9 Telugu

మన చిన్నతనంలో పండగ, పబ్బం... పెళ్లి, వేడుక సందర్భం ఏదైనా అరిటాకులోనే అన్నం తినేవాళ్లం. కానీ ఇప్పుడు అంతా ప్లాస్టిక్‌ మయం అయిపోయింది

TV9 Telugu

అరటి ఆకులో భోజనం చేస్తే అమృతంతో సమానమని మన పూర్వికులు నమ్ముతారు. ఇందులోని అనేక పోషకాలు ఆహార రుచిని పెంచుతాయి

TV9 Telugu

అన్నంలో విషం ఉంటే అరటి ఆకు నల్లగా మారి, వెంటనే మనక సంకేతాన్ని ఇస్తుంది. పైగా ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు

TV9 Telugu

కొబ్బరినూనెను అరటి ఆకులతో రాసి, గాయాలపై రాస్తే కాలిన గాయాలు త్వరగా మానుతాయి. అలాగే ఎక్కిళ్లు వచ్చినప్పుడు అరటి ఆకులో తేనె వేసి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి

TV9 Telugu

అరటి ఆకులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇది యాంటీ బాక్టీరియల్ కూడా. అరటి ఆకులకు ఉదర వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది

TV9 Telugu

అరటి ఆకులు డయేరియా, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే మన పూర్తికులు ఎల్లవేళలా అరిటాకుల్లోనే భోజనం చేసేవారు

TV9 Telugu

ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో వీటిలోనే ఎక్కువగా భోజనం చేస్తుంటారు. దీనిలోని పాలీఫినాల్స్‌ వడ్డించిన పదార్థాలకు చేరతాయి. ఆహారం చెడిపోకుండా నిల్వ ఉండటానికి ఈ ఆకు ఎంతో మంచిది. ఇది పదార్థాల్లోని చెడు తత్వాలను గ్రహిస్తుంది. అందుకే దీన్ని ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు