ఇంటిపేరులో మార్పులు చేయాలనుకుంటే, దానిని గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించాలి. తెలంగాణ వారైతే ఈ సమాచారాన్ని తెలంగాణ గెజిట్‌లో ప్రచురించవచ్చు. రెండవది, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా, పెట్టుబడి, బ్యాంక్, PF, పెన్షన్ మొదలైన వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్‌లలో ఎవరైనా తన పేరులో మార్పులు చేయవచ్చు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
గెజిట్ నోటిఫికేషన్ పొందడానికి అఫిడవిట్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అఫిడవిట్‌లో, మీరు మీ పేరు, చిరునామా, వయస్సు వివరాలను ఇవ్వాలి. అలాగే, మీరు మీ పేరును ఎందుకు మార్చుకుంటున్నారో తెలియజేయాలి.
భవిష్యత్తులో మీ పేరు ఏమిటి. మీ ఇంతకు ముందు మీ డాక్యుమెంట్స్ ఏ పేరుతో ఉన్నాయో మీరు అఫిడవిట్‌లో పేర్కొనవలసి ఉంటుంది. ఈ అఫిడవిట్ నోటరీ లాయర్ అలాగే ఓత్ కమీషనర్ ద్వారా సర్టిఫై చేయించాలి.
అఫిడవిట్ తర్వాత, గెజిట్ నోటిఫికేషన్ పొందడానికి రెండు న్యూస్ పేపర్స్ లో ఈ విషయాన్ని ప్రకటనగా పబ్లిష్ చేసి ఉండాలి. వీటిలో ఒక వార్తాపత్రిక హిందీ లేదా రాష్ట్ర భాష అలాగే మరొకటి ఇంగ్లీషు అయి ఉండాలి.
న్యూస్ పేపర్ ఒరిజినల్ కాపీని తీసుకోవాలి. వార్తాపత్రిక ఫోటోకాపీ గెజిట్ నోటిఫికేషన్ కోసం చెల్లదు. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డు రెండు ఫొటోలు ఇవ్వాలి
అత్యంత ముఖ్యమైన.. చివరి డాక్యుమెంట్ అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ ను ప్రచురణ విభాగం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌లు పెద్దవారికి, మైనర్‌లకు వేర్వేరుగా ఉంటాయి.
పేరు మార్పు కోసం ఫామ్‌ను ప్రచురణ విభాగంలో సమర్పించాల్సి ఉంటుంది. మీరు ఈ ఫారమ్‌ను పోస్ట్ ద్వారా పంపవచ్చు లేదా మీరు స్వయంగా వెళ్లి సమర్పించవచ్చు. దీని కోసం, నిర్ణీత రుసుము సుమారు వెయ్యి రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.