గుమ్మడికాయతో మెరిసిపోయే చర్మం.. ఇలా చేస్తే అందమే అందం!
Jyothi Gadda
11 March 2024
సహజసిద్ధమైన గుమ్మడికాయ గుజ్జుతో ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్స్ చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. నిత్యం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది.
గుమ్మడిని ఫేస్ ప్యాక్స్ లో ఉపయోగించడానికి ముందుగా దాన్ని ఉడికించుకొని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న మెత్తని గుమ్మడి గుజ్జుతో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవాలి. దీంతో మీ మెరిసిపోతుంది.
గుమ్మడి గుజ్జు, పెరుగు, కాస్త తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి తక్షణ నిగారింపునిస్తుంది.
గుమ్మడి గుజ్జు, తేనె, ఒక స్పూన్ ఓట్స్ పొడిని తీసుకొని ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా సున్నితంగా మర్దన చేసుకోవాలి.15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది.
గుమ్మడి గుజ్జు, 2 స్పూన్ ల చక్కెర, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖానికి మంచి టోనర్ లా పనిచేసి చర్మానికి నిగారింపును అందిస్తుంది.
ఒక కప్పులో కొద్దిగా గుమ్మడి గుజ్జు , కొద్దిగా పైన్ ఆపిల్ గుజ్జు, యాపిల్ గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇది చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌గా సహాయపడి చర్మానికి తేమను అందిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా ముఖం వాపును తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా మెరిసేలా సహాయపడుతుంది
గుమ్మడి గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, కొద్దిగా తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా చేస్తే చర్మం నిగారింపు పెరుగుతుంది. మొటిమలు తగ్గుతాయి.