ఆసియాలోనే అతిపెద్ద పనస తోట ఎక్కడ ఉందంటే? 42 రకాలు ఉన్నాయి

30 May 2024

TV9 Telugu

Pic credit - getty

ఆసియాలోనే అతిపెద్ద పనస తోట కర్ణాటకలోని ఉంది. ఈ తోట కర్ణాటకలోని కోలార్‌ జిల్లలో ఉంది. తమక సమీపంలో ఎంహెచ్ మరిగౌడ ఈ తోటను నిర్మించారు

తోట ఎక్కడ ఉంది?

కోలార్‌లోని టమాకలోని హార్టికల్చర్ యూనివర్సిటీ సమీపంలో పనస తోట సుమారు 40  ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 2009లో ఈ స్థలంలో హార్టికల్చరల్ యూనివర్సిటీని స్థాపించారు.

ఎన్ని ఎకరాల్లో తోట ఉందంటే  

1974లో నిర్మించిన ఈ తోటలో 15 వేలకు పైగా పనస చెట్లు ఉన్నాయి. తోటలో 42 వివిధ రకాల పనస మొక్కలు ఇక్కడ ఉన్నాయి. 

ఎన్ని జాతులు?

గౌడ ఆరంజ్, గామా లేస్ , సూపర్‌తో సహా మూడు రకాల పనసపండు చాలా తీపిగా ఉంటాయి. ఈ తోటలో పండిన పనస పండ్లకు డిమాండ్‌ ఎక్కువ. దీంతో ప్రతి ఏడాది టెండర్‌ పిలిచి పండ్ల విక్రయం జరుపుతారు. 

అత్యంత తీపి పనస

ఇక్కడ చాలా ఏళ్లుగా పనస పండ్లను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పనస తోనలతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసేందుకు ప్రాసెసింగ్ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు.

ప్రాసెసింగ్ ప్లాంట్ సౌకర్యం

అయితే ఏడాది ఏడాదికి ఎండ వేడి పెరిగిపోతున్న కారణంగా ఈ తోటలో పనస దిగుబడి తగ్గిపోయింది. గతేడాది తోట మొత్తానికి 15 టన్నుల పనస పండింది.

 పనస దిగుబడి

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు పనస తొనలు తినడం వలన మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజు రోజుకీ మార్కెట్ లో పనస పండుకి డిమాండ్ పెరుగుతోంది.

ఆరోగ్య ప్రయోజనాలు