ఈ సమస్య ఉన్నవారు బెండకాయని పొరపాటున కూడా తినొద్దు.. 

06 June 2024

TV9 Telugu

Pic credit - getty

రుచిలో మాత్రమేకాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది బెండకాయ. దీనిలో విటమిన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి ఉన్నాయి 

పోషకాలు మెండు 

కొన్ని వ్యాధులున్నవారు బెండకాయను తింటే వారి ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఈ రోజు ఎవరు బెండకాయకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.. 

ఎవరికి హానికరం అంటే 

బెండకాయలో ఎక్కువ మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. కనుక కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు తినొద్దు. తింటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది.  

కిడ్ని స్టోన్స్

ఎవరైనా అలెర్జీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే బెండకాయ తినొద్దు. కొంతమందికి చర్మంపై దురద , దద్దుర్లు లేదా ఇతర అలెర్జీ సమస్యలు కలగవచ్చు. 

అలర్జీలు

బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక దీనిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అపానవాయువు లేదా కడుపు నొప్పి ఉన్నట్లయితే తినడం తగ్గించడమే ఉత్తమం. 

కడుపు ఉబ్బరం, ఎసిడిటీ

బెండకాయలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. దీంతో మోకాళ్లలో నొప్పి, వాపు పెరుగుతుంది. గౌట్ రోగులు దీనిని తినకుండా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు.

ఆర్థరైటిస్ విషయంలో..

దగ్గు, సైనస్ తో ఇబ్బంది పడుతున్నా... జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నట్లయితే, బెండకాయను తినకుండా ఉండడం మంచిది. 

దగ్గు, సైనస్

హైపర్‌టెన్షన్ రోగులు లేడీఫింగర్ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. అధిక పొటాషియం రక్తపోటు రోగులకు హానికరం, ఎందుకంటే ఇది బీపీని పెంచుతుంది.

హై బీపీ