కృష్ణఫలం గురించి ఎప్పుడైనా చూశారా? పోనీ కనీసం విన్నారా.. అబ్బేం మాకేం తెలియదు అని అనుకుంటున్నారా? ఐతే మీరీ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే
సీతాఫలం, రామా ఫలం మాదిరిగానే కృష్ణ ఫలం కూడా అద్భుత పోషకాలు ఉన్న ఓ పండు. ఇది చూడటానికి గుండ్రంగా, మెరూన్ లేదా పసుపు ఉంటుంది
బయటి భాగం గట్టిగా ఉంటుంది. లోపలి భాగం జ్యూ'సీగా మెత్తగా ఉంటుంది. నిజానికి ఈ పండు వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
మన దేశంలో ఈ పండుని ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇది ఉష్ణమండల పండు. దీని శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడులిస్. ఈ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
ఈ పండులో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. దీనిలోని పిసిటానాల్' అనే సమ్మేళనం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది
కృష్ణఫలంలో ఉండే పోటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుపరుస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి
ఈ పండులో విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ ఉంటుంది. అందువల్ల ఈ పండు తింటే కంటి పనితీరు మెరుగుపడి, కళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. అంధత్వం రాదు
కృష్ణఫలంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను ఇది నివారిస్తుంది. ఈ పండులో కేన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి