ఫస్ట్ నైట్ రోజు పాలు ఎందుకు తాగుతారో తెలుసా ??

TV9 Telugu

25  March 2024

పెళ్లయిన మొదటి రోజున  శోభన గదిలోకి పాల గ్లాసును తీసుకెళ్తారన్న విషయం తెలిసిందే.. అయితే ఫస్ట్ నైట్ రోజు పాలు ఎందుకు తాగుతారో తెలుసా ??

ఫస్ట్ నైట్ గదిలోకి పాలను తీసుకెళ్తారన్న విషయం చాలామంది తెలుసుకానీ ఎందుకనేది తెలియదు.. దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫస్ట్ నైట్ రోజు భార్య  భర్త  దగ్గరకి పాలు తీసుకెళ్లటం పురాతన సంప్రదాయం. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏమైనాప్పటికీ.. పూర్వికులు మాత్రం దీనిని శుభం, శ్రేయస్సుగా సూచిస్తారు.

పాలు పునరుత్పత్తి శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పురుషులలో వీర్య కణాల నాణ్యతను మెరుగుపరుస్తాయి. స్త్రీలలో పాలు గర్భధారణ అవకాశాలను పెంచుతాయి. 

 పాలు శరీర శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. శోభనం రాత్రి అలసటను దూరం చేసేందుకు కూడా పాలు కీలక పాత్ర పోషిస్తాయి.  

పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. కాబట్టి మొదటిరోజు రాత్రి శోభన సమయంలో వధూవరులు ఇద్దరు ఈ పాలను తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. 

వధూవరుల కలయిక బాగుండడానికి మానసిక స్థితి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మూడు బాగుండడానికి శోభనం రోజు రాత్రి పాలు తాగుతారు. 

వధూవరులు ఇద్దరు శోభనం రోజు చాలా లేటుగా నిద్రపోతారు దీని కారణంగా జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాలు తాగితే ఈ సమస్య ఉండదు.