కొబ్బరి నీళ్లతో నష్టాలు కూడా ఉన్నాయని తెలుసా..?

Jyothi Gadda

08 October 2024

కొబ్బరి నీళ్లను సాధారణంగా అమృతంతో పోలుస్తారు. ఆరోగ్యపరంగా అంత అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. కానీ, కొందరు మాత్రం వీటికి దూరంగా ఉండాలి..

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తరచూ కొబ్బరి నీళ్లు తాగకూడదు. అప్పుడప్పుడు తాగొచ్చు. తరచూ తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫలితంగా కిడ్నీలపై ప్రభావం పడుతుంది. 

అజీర్తి సమస్య ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉంటే మంచిది. లేకపోతే కడుపులో నొప్పి, డయేరియా సమస్య రావొచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం కడుపుకు నష్టం చేస్తుంది. 

ఆయుర్వేదం ప్రకారం కొబ్బరి నీళ్లతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని వ్యాధులతో సతమతమయ్యేవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. 

లో బీపీ సమస్య అధిక రక్తపోటుతో బాధపడేవారికి కొబ్బరి నీళ్లు తాగమని సూచిస్తుంటారు. కానీ మోతాదుకు మించి తాగితే  బ్లడ్ ప్రెషర్ తక్కువై లోబీపీ సమస్య రావచ్చు.

ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ కొబ్బరి నీళ్లు అప్పుడప్పుడూ తాగితే ఏం కాదు. పరిమితి దాటి తాగితే మాత్రం శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చెడిపోతుంగది. ఇతర అనారోగ్యం రావొచ్చు.

కొబ్బరినీళ్ళలో సాధారణ నీటిలో ఉండే సోడియం కంటే ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అతిగా తీసుకోవడం వల్ల అలసిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

అతిగా కొబ్బరి నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నీటిలో ఉండే మూలకాలు అలర్జీ వంటి సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది.