పువ్వుల్లో పోషకాలు.. వీటిని కూడా తినొచ్చు!
8 September 2023
మల్లె, మందారం, చింతపువ్వు, ఇప్పపువ్వు, కలువ పువ్వు వంటి పలు రకాల పువ్వులను ఆహారంలో భాగంగా తినొచ్చని చాలా మందికి తెలియదు
ఇవి రోగనిరోధకశక్తినీ, జీవక్రియా రేటునీ మెరుగుపరచడమే కాకుండా ఆహారానికి మంచి రంగు, రుచినీ తెచ్చిపెడతాయంటున్నారు సోషకాహార నిపుణులు
బొప్పాయి ఆకు, కాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు అంటాయి. అలాగే బొప్పాయి పువ్వుల్లోనూ మెగ్నీషియం, విటమిన్ ఎ, సి లు మెండుగా ఉంటాయి
ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడమేకాకుండా మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అలాగే మునగ పూలల్లో కూడా పోషకాలు నిండుగా ఉంటాయి
ఇప్ప పువ్వు ఆహారంలో తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులకి సహజ నివారణిగా సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసాన్ని కూడా తగ్గించడంలో మేలు చేస్తుంది
మునగ పూలల్లో పీచు, మెగ్నీషియం, పొటాషియం, ప్రొటీన్లు పోషకాహార లోపాన్ని పారదోలుతాయి. కండరాల వాపు తగ్గుముఖం పట్టేలా చేస్తాయి
మల్లె పూలను బియ్యంలో కలిపి వండుకుంటారనే సంగతి కూడా చాల మందికి తెలియదు. అలాగే జాస్మిన్ టీ కూడా కాచుకుని తాగుతారు
మల్లెపూలలోని పోషకాలు, విటమిన్లు రక్తపోటునీ తగ్గించి, వృద్ధాప్య ఛాయల్ని దరిదాపుకు రాకుండా నివారిస్తుంది. ఇప్పపువ్వును తేనె, జామ్, పలురకాల స్వీట్ల తయారీలో వాడతారు
ఇక్కడ క్లిక్ చేయండి