27 August 2023

అతిగా నిద్ర పోతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..

సంపూర్ణమైన ఆరోగ్యానికి పోషకాలతో కూడిన ఆహారం అవశ్యకం అయినట్లుగానే సరిపడినంత నిద్ర కూడా అంతే అవశ్యకం.

ప్రతి రోజూ కనీసం 8, 9 గంటల పాటు నిద్రించినవారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొందరు అంతకుమించి నిద్రపోతుంటారు.

అతిగా నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, గుండెపై కూడా చెడు ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

నిద్రంచే సమయంలో రక్త ప్రసరణ సాధారణం కంటే నెమ్మదించి గుండె పనితీరుపై చెడు ప్రభావం పడేలా చేస్తుంది.

ఇంకా అధ్యయనాల ప్రకారం ప్రతి రోజూ 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వారితో పోలిస్తే, రోజులో 7, 8 గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.

8 గంటల కంటే ఎక్కువగా నిద్రించడం వల్ల మెదడులోని కొన్ని రకాల న్యూరో ట్రాన్స్‌మీటర్ల‌పై చెబు ప్రభావం ఉంటుంది.

పడి తలనొప్పికి దారితీస్తుంది. అలాగే రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రలేకున్నా తలనొప్పి ఎదురవుతుంది.

8 గంటలకు మించి నిద్రపోతే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. నిద్రించే సమయంలో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది.