'టీ' అతిగా మరిగించి తాగితే క్యాన్సర్ ముప్పు ముంగిట్లోనే..

May 23, 2024

TV9 Telugu

TV9 Telugu

చాలామంది రోజుని ఓ కప్పు 'టీ'తో ప్రారంభిస్తారు. అయితే చాలామంది మంచి చిక్కటి 'టీ' కోసం అదేపనిగా మరిగిస్తుంటారు. కాస్త ఎక్కువగా మరిగిన 'టీ'నే మంచి రుచి అని చాలామంది ఫీలింగ్‌

TV9 Telugu

అయితే ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి చిక్కటి టీ తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు

TV9 Telugu

నిజానికి, కొందరు 'టీ'ని ఆకులతో చేయడానికి ఇష్టపడతారు. మరికొందరూ కొద్దిగా పాలను, చక్కెరను జోడించి తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేసేటప్పుడూ బాగా మరిగిస్తుంటారు

TV9 Telugu

ఇలా బాగా మరిగిపోయిన చిక్కటి 'టీ' తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా 'టీ' తాగడం వల్ల బరువు తగ్గుతారు, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి మంచి ప్రయోజనాలు ఉంటాయి

TV9 Telugu

ఎప్పుడైతే అదే పనిగా కెఫిన్‌ పానీయాన్ని ఇలా వేడి చేస్తుంటామో 'టీ'లో టానిన్‌లు ఉంటాయి. వీటిలో పాలీఫెనోలిక్‌ జీవ అణువులు ఉంటాయి. అవి ప్రోటీన్లు, సెల్యులోజ్‌, పిండి పదార్థాలు, ఖనిజాలతో బంధించే అణువులు

TV9 Telugu

ఎప్పుడైతే టీని మరిగిస్తామో ఇవి కరగని పదార్థాలుగా మారి శరీరంలోని ఐరన్‌ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. టీ నీటిని పదేపదే మరగపెట్టడం వల్ల అందులోని పోషకాలు క్షీణించడంతోపాటు అజీర్ణం, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలకు దారితీస్తుంది

TV9 Telugu

టీని మరిగించడం వల్ల దానిలో ఉండే పీహెచ్‌ మారి, ఆమ్లంగా మారుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద మరిగిన టీలో యాక్రిలామైడ్ వంటి మిశ్రమాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలు. ఎంతలా మరిగిస్తే అంతలా ఈ క్యాన్సర్‌ కారకాలు ఉత్పత్తి అవుతాయి

TV9 Telugu

నిజానికి, టీ తయారీకి జస్ట్‌ 5 నిమిషాలు చాలు. ఓ గిన్నెలో కాసిన్ని నీరు పోసుకుని, అందులో ఓ టీస్పూన్‌ టీ వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించాక అందులో కొద్దిగా వేడి చేసిన పాలు, చక్కెర వేస్తే చాలు.. టీ కమ్మగా ఉంటుంది