Krishna Tulasi Benefits: కృష్ణ తులసి ఆకులతో.. ఈ అనారోగ్యాలు మాయం 

25 November 2023

కృష్ణ తులసిని.. అనేక ప్రాంతాల్లో శ్యామ తులసి అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే దీని రంగు కృష్ణుడు మాదిరిగా ఉంటుంది. 

కృష్ణ తులసి ఆకులు తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

 ప్రతి రోజూ ఉదయం రెండు కృష్ణ తులసి ఆకులు నమిలితే.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. రోజు కృష్ణ తులసి ఆకులు నమిలితే.. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. తులసిలోని ఔషధ గుణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.

శీతాకాలం వచ్చిందంటే చాలా మందిలో శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 

పొడి దగ్గు, శ్లేష్మంతో దగ్గు ఉంటే కృష్ణ తులసితే దగ్గు సిరప్‌ తయారు చేసుకుని వాడితే మంచిది. ఈ సిరప్‌ జలుబు, దగ్గుకు ఔషధంలా పనిచేస్తుంది. ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది.

శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు కృష్ణ తులసితో తయారు చేసిన కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

ఈ తులసిలో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. చలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తులసిని తీసుకోవాలి.