రోజూ ఉసిరి తినడం వల్ల కళ్లకు చాలా మంచిది. కంటి చూపు పెరుగుతుంది. కంటి సంబంధిత కేటరాక్ట్ , రెటినల్ డిసార్డర్స్ సమస్యలకు ఉసిరి మంచి పరిష్కారం. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉసిరిలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, టానిన్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేస్తాయి. రోజూ ఒక ఉసిరికాయ తింటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది.
ఉసిరికాయలో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఉసిరి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తాయి. మొటిమలను, వృద్ధాప్య ఛాయలు దూరం చేస్తాయి. చర్మంలో కొల్లాజెన్ ఏర్పడేలా చేస్తుంది.
బరువు నియంత్రణలో ఉసిరి క్రమం తప్పకుండా రోజూ తినడం వల్ల బరువు నియంత్రణకు దోహదపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గుతుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది.
గుండె ఆరోగ్యం ఉసిరి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నియంత్రిస్తుంది.
మధుమేహం ఉన్నవారికి లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఉసిరి మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది.
కేశాలకు లాభం ఉసిరి తినడం వల్ల కేశాల ఎదుగుదల బాగుంటుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. జుట్టుని కుదుళ్ల నుంచి పటిష్టం చేస్తుంది.
ఉసిరికాయ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ నియంత్రిస్తుంది. రక్త ప్రసరణ మెరుగు పరుస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.