ఈ పూల చెట్టు సంజవనీ.. లాభాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!

Jyothi Gadda

27 September 2024

పారిజాతం వృక్షం ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటారు. ఈ పూల వాసన ఆరోగ్యం, ఆహ్లాదాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అదెలాగో వివరంగా చూసేయండి.

పారిజాతం ఆకులు, పూలను అనేక ఆరోగ్య సమస్యలకు మందులాగా వాడొచ్చు.  పారిజాతం గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసి నీటితో కలిపి తలకు పెట్టుకుంటే పొక్కులు తగ్గుతాయి.

పారిజాత చుర్ణాన్ని కొబ్బరినూనెలో కలుపుకుని పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. వీటిఆకుల రసాన్ని నాలుగు చుక్కలను చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గతుంది.

పారిజాతం ఆకులను మెత్తగా నూరి వాటిని ఆముదంలో కలిపి, సన్నని సెగపై వేడి చేసి వాతపు నొప్పులు ఉన్నచోట పెడితే ఉపశమనం లభిస్తుంది. 

పారిజాతం ఆకులను మెత్తగారుబ్బి రసాన్ని తీసి సగం అయ్యే వరకు వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే దానిలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. సయాటికా నొప్పి తగ్గిపోతుంది.

గజ్జి, తామర సమస్య ఉన్నవారు పారిజాతం గింజలను కుండపెంకుల్లో మాడ్చి.. మసిగా చేసి కర్పూరం కలిపి ఆ లేపనాన్ని పూస్తే మంచి ఫలితం ఉంటుంది.

పారిజాత పూల టీని క్రమం తప్పకుండా రోజూ తాగుతూ ఉండటం వల్ల స్త్రీ సంబంధమైన అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

పారిజాత పూల టీతో ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది పలుచన చేసి బయటకు తోసి వేస్తుంది. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయి.