ఈ చిట్కాలు పాటిస్తే మీ గోర్లకు రెట్టింపు అందం..!

TV9 Telugu

15 February  2024

గోర్లు చేతి వేళ్ల అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. అందుకే అమ్మాయిలకు వీటిపై అంత ఇష్టం ఉంటుంది. అందమైన నెయిల్ ఆర్ట్‌తో సింగారిస్తుంటారు. 

నెయిల్ మాలిష్ గోర్లను రోజూ మాలిష్ చేయడం చాలా మంచి పద్ధతి. దీనివల్ల గోర్ల చుట్టూ ఉండే మలినాలు, వ్యర్ధాలు తొలగిపోవడమే కాకుండా డెడ్ స్కిన్ పోతుంది. 

ఆరెంజ్ జ్యూస్ గోర్లను అందంగా చేస్తాయి. ఆరెంజ్‌ జ్యూస్‌తో గోర్లకు మర్ధనతో గోర్లు మరింత అందంగా మారతాయి. 

పాలు  శరీరానికి సూపర్ ఫుడ్‌లా పనిచేస్తాయి. గోళ్ళలో కెరాటిన్ సమతుల్యతను కాపాడటానికి, కెరాటిన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రోటీన్ అవసరం. అందుకే పాలు ఉపయోగపడతాయి.

పాలను కాటన్ సహాయంతో రోజూ గోర్లకు అప్లై చేయాలి. దీనివల్ల గోర్లు నిగనిగలాడతాయి. మరింత అందంగా కన్పించేందుకు నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు.

పాలను కాటన్ సహాయంతో రోజూ గోర్లకు అప్లై చేయాలి. దీనివల్ల గోర్లు నిగనిగలాడతాయి. మరింత అందంగా కన్పించేందుకు నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు.

వెల్లుల్లి వెల్లుల్లి గోర్లను అందంగా, ఆకర్షణీయంగా మల్చడంలో ఉపయోగపడతాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ చిట్లిన గోర్లను దృఢపరచి గోర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

గోర్ల పెరుగుదలలో కూడా వెల్లుల్లి అద్భుతంగా దోహదపడుతుంది. వెల్లుల్లి రసాన్ని కాటన్ సహాయంతో గోర్లకు అప్లై చేయాలి.