సాధారణంగా నిద్రపోయిన తర్వాత కొన్ని వింత కలలను రావడం, అవి కలలో మన కళ్ల ముందు దృశ్యాలుగా కనబడటం వంటివి తరచుగా జరుగుతుంటాయి.
కొంతమందికి నిద్రలో కింద పడినట్లు కలలు వస్తాయి. మరికొందరు ఆకాశంలో ఎగురుతున్నట్లు కలలు కంటారు. మీరూ కలలో ఎగురుతున్నట్లు ఎప్పుడైనా కలగంటే..
కలలో గాలిలో ఎగురుతున్నట్లు వస్తే అది శుభప్రదమైన కల. అలాంటి కలను చూసిన తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు.
ఎవరైనా తమ కలలో గాలిలో ఎగురుతున్నట్లు చూస్తే, వారి పెండింగ్ పనులు కొన్ని త్వరలో పూర్తవుతాయని అర్థం.
కలలో ఎగురుతున్నట్లు చూసేవారు జీవితంలో విజయం సాధిస్తారు. వారు తమ పని, వ్యాపారం, ఉద్యోగం, వృత్తిలో విజయం సాధిస్తారు.
కలలో ఎగురుతున్నట్లు చూడటం అంటే మీరు జీవితంలో కొత్త పనిని ప్రారంభించబోతున్నారని అర్థం.
ఒక వ్యక్తి తాను ఎత్తైన ప్రదేశం నుండి పడిపోతున్నట్లు కలలో చూస్తే, ఆ వ్యక్తికి ఆరోగ్య సంబంధిత సమస్య వస్తుందని అర్థం. ఇలాంటి వారు తమ శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి.
తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. కలలలో జరిగే కొన్ని సంఘటనలు ఒక్కోసారి మన జీవితాల్లో కూడా జరుగుతాయి. అందువల్ల, జాగ్రత్త తీసుకోవాలి.