శీతాకాలంలో సీతాఫలం తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. తప్పకుండా తింటారు..!

14 November 2023

సీతాఫలం పండులో శరీరానికి అవసరమైన విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 

సీతాఫలంలో ఉండే కౌరినోయిక్ యాసిడ్, విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు..దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఈ పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇది కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పక్షవాతంవంటి వ్యాధులను నివారిస్తుంది. మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. 

ఈ పండులోని ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణాశయ మంట వంటి వ్యాధుల నుంచి కాపాడి శరీరానికి శక్తిని అందిస్తాయి.

ఇందులో విటమిన్ నియాసిన్ ఉంటుంది. నియాసిన్ విటమిన్ వినియోగం కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు నుండి రక్షిస్తుంది. 

సీతాఫలంలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. ఆస్తమాతో బాధపడేవారు సీతాఫలం తింటే కొంత ఉపశమనం లభిస్తుంది.

ఇది అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన పండు. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, శోథ నిరోధక చర్య ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.