పాదాల అందం కోసం తీసుకునే ఫిష్ పెడిక్యూర్..ఎంత ప్రమాదకరమో తెలుసా..?

06 December 2023

ఫిష్ పెడిక్యూర్ అనేది టర్కీ నుండి వెలుగులోకి వచ్చిన ఒక రకమైన చికిత్స. ఇందులో చేపలతో నిండిన ఒక టబ్‌లో మీ పాదాలను ఉంచాలి.

ఫిష్‌ పెడిక్యూర్‌ చికిత్సలో ఉపయోగించే చేపలను గుర్ర రాఫా అని పిలుస్తారు. ఈ చేపలు పాదాల నుండి డెడ్ స్కిన్‌ను తినేయటం వల్ల మీ పాదాలు క్లీన్‌గా కనిపిస్తాయి.

ఈ చికిత్స సమయంలో కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ, ఈ చికిత్సలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి.

ఫిష్ పెడిక్యూర్ కోసం ఉపయోగించే బేసిన్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయక పోవటం, ఒకే బేసిన్‌లో చాలా మంది తమ పాదాలను పెట్టి చికిత్స తీసుకుంటారు. 

ఇది అనేక పరిశుభ్రత సమస్యలకు దారి తీస్తుంది. రక్త సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. 

ఇక టబ్‌లో వేసే చేపల్లో కూడా వ్యాధి కారక బాక్టీరియా ఉంటుంది. ఇది అనేక ఇన్ఫెక్షన్ల ప్రమాదానికి దారి తీస్తుంది.

చికిత్సకు వాడే గుర్రా రుఫా చేప చనిపోయిన చేపలను తింటుంది. వాటికి ఈ ఆహారం ఇవ్వకపోతే అది ఆకలితో జనాల పాదాలపై ఉన్న స్కిన్‌ను కొరుకుతుందట. దీంతో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. 

నిజానికి ఫిష్ పెడిక్యూర్ ప్రక్రియ మంచిది. మృదువైన చర్మాన్ని ఇస్తుంది. కానీ దీని చుట్టూ ఉన్న ఆరోగ్య సమస్యల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.