బరువు తగ్గడానికి, మెరుగైన ఆరోగ్యానికి ఉప్పు తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే నెల రోజుల పాటు ఉప్పును పూర్తిగా తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా?
ఒక నెల పాటు ఉప్పు తినకుండా ఉంటే క్రమంగా బరువు తగ్గుతారు. అలా ఉప్పు తినకపోతే శరీరం తక్కువ తినడానికి అలవాటు పడుతుంది. పొట్ట, నడుము కొవ్వును తగ్గిస్తుంది. కానీ ఒక్కసారిగా ఎక్కువ బరువు తగ్గితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని గుర్తుంచుకోవాలి.
ఒక నెల పాటు ఉప్పు తీసుకోకపోతే, శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అలాగే ఇది ప్రేగులను ప్రభావితం చేస్తుంది. కడుపు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం పరంగా కూడా డేంజరే. అందుకే ఉప్పు తినడం పూర్తిగా మానేయకూడదు. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి వల్ల బీపీ తగ్గడంతో పాటు ఆందోళనకు దారితీస్తుంది. అందుకే శరీరానికి పరిమితమైన మోతాదులో ఉప్పు తీసుకోవడం చాలా అవసరం.
ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. కానీ ఉప్పు పూర్తిగా నిషేధిస్తే మాత్రం డేంజర్ అంటున్నారు నిపుణులు. ఉప్పు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
తగినంత ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ దీన్ని తీసుకోవడం మానేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు ఉప్పు తీసుకోకపోతే, కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.