రోజూ అరటిపండు తింటే ఏమవుతుందో తెల్సా.. అమేజింగ్ అంతే!
Ravi Kiran
28 Sep 2024
అరటిపండులో ఫైబర్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
అరటి పండులో గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నుండి మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
అరటిపండు జీర్ణక్రియను బలోపేతం చేయడానికి ఉత్తమమైన పండు. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది.
మీకు తరచుగా గ్యాస్, అజీర్ణం సమస్యలు ఉంటే అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోంది. అరటిపండు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది.
అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉంటాయి. ఈ కారణంగా ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
అరటిపండులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మీ శరీరానికి శక్తిని అందించడానికి పని చేస్తాయి. ఇందులో విటమిన్ ʼBʼ కూడా ఉంటుంది.
అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరమైన ఖనిజంగా పరిగణించబడుతుంది. ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ అరటిపండు తింటే, మీ గుండె ఆరోగ్యాన్ని గమనించవచ్చు.
అరటిపండులో మాంగనీస్ ఉంటుంది. ఇది చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా మారుస్తుంది.