గ్యాస్ స్టవ్ జిడ్డును తొలగించే సింపుల్ చిట్కాలు.. 

11 August 2023

బేకింగ్ సోడాను స్టవ్ మీద జల్లి నిమ్మకాయతో రుద్దాలి. అప్పుడు జిడ్డు తొందరగా పోతుంది.

వెనిగర్ ను గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేసి  తరవాత క్లీన్ చేస్తే గ్యాస్ స్టవ్ మీద జిడ్డు పోతుంది

గోరువెచ్చని నీరులో సర్ఫ్ కలిపి ఆ నీటిలో స్పాంజ్ ముంచి గ్యాస్ స్టవ్ ను తుడవండి 

ఒక పది నిముషాలు తరువాత మళ్ళీ పొడి గుడ్డతో తుడవండి. మీ స్టవ్ తళతళ మెరిసిపోతుంది.  

ఒక గిన్నెలో నీటి, డిష్ సోప్, బేకింగ్ సోడాను వేసి బాగా మిక్స్ చేయండి. ఈ నీటిలో బర్నర్ స్టాన్డ్స్ ఉంచితే జిడ్డు తొలగిపోతుంది

బేకింగ్ సోడా, ఉప్పును తీసుకొని..నీటిని కలిపి పేస్ట్ లాగా తయారుచేసి దానిని పొయ్యి మీద స్క్రబ్ చేయాలి.

తరువాత మామూలు నీటితో కడగాలి. ఇలా చేసినా గ్యాస్ స్టవ్ మీద జిడ్డు తొలగిపోతుంది.

ఉల్లిపాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి గ్యాస్ స్టవ్ ను శభ్రం చేసినా జిడ్డు పోతుంది