మీ ఇంట్లో నాన్ స్టిక్ పాన్‌లు ఎన్నేళ్లు వాడుతున్నారు? ఈ తప్పులు చేయకండి
04 August 2024
TV9 Telugu
TV9 Telugu
తక్కువ నూనెతో వంట చేయడానికి నాన్‌స్టిక్ పాన్‌ని ఉపయోగించడం నేటి రోజుల్లో పరిపాటై పోయింది. కానీ వీటిని సరైన రీతిలో వినియోగించకుంటే లేనిపోని ఇబ్బందుల్లో పడవల్సి వస్తుంది
TV9 Telugu
నాన్ స్టిక్ ప్యాన్లలో టెఫ్లాన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ నాన్ స్టిక్ పాన్‌ని రోజూ ఉపయోగించడం వల్ల ఈ టెఫ్లాన్ కరిగిపోయే ప్రమాదం ఉంది
TV9 Telugu
పెర్ఫ్లూరోక్టానోయిక్ యాసిడ్ (PFOA) అనే ప్రమాదకరమైన రసాయనంతో ఈ టెఫ్లాన్‌ను తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి హానికరం
TV9 Telugu
నాన్ స్టిక్ పాన్‌పై పూతలా వేసే టెఫ్లాన్ విచ్ఛిన్నమైతే.. అలాంటి ప్యాన్‌లను ఉపయోగించకూడదు. అయితే ఎలాంటి సందర్భాల్లో నాన్‌స్టిక్ పాన్‌ను వాడటం ప్రమాదం, వీటిని ఎన్ని రోజులు వాడాలి? అనే సందేహాలు మీకూ ఉన్నాయా?
TV9 Telugu
నాన్ స్టిక్ పాన్ పాడైతే అందులో వంట చేయకపోవడమే మంచిది. ఇది ఆహార నాణ్యతను నాశనం చేస్తుంది. నాన్ స్టిక్ పాన్ రంగు మారినా, పాన్ రంగు ఊడిపోయినట్లు కనిపించినా.. అందులోని టెఫ్లాన్ పాడైపోయినట్లు అర్ధం చేసుకోవాలి
TV9 Telugu
ఇలాంటి పాన్‌లను వెంటనే పడేయాలి. అలాగే నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు కనిపించినా అలాంటి పాన్‌ని మార్చేయాలి. గీతలు కలిగిన పాన్‌లో వంట చేయడం ప్రమాదకరం
TV9 Telugu
పాన్ ఎంత మంచిదైనా సరే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నాన్‌స్టిక్ పాన్‌ని మార్చేయాలి. రోజుల తరబడి పాత నాన్‌స్టిక్ పాన్‌లో ఉడికించడం వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం వస్తుంది
TV9 Telugu
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నాన్-స్టిక్ పాత్రలను వినియోగించకపోవడమే మంచిది. బదులుగా మట్టిపాత్రలు, కోటింగ్ లేని గ్రానైట్ గిన్నెలు వంటివి మాడటం మంచిది