గ్యాస్ స్టవ్ తళతళలాడించేద్దామా ..! ఇలా క్లీన్ చేసి చూడండి
30 August 2024
TV9 Telugu
TV9 Telugu
వంట చేసేటప్పుడు స్టవ్‌పై నూనె చిట్లడం, ఇతర ఆహార పదార్థాలు పడడం మామూలే. అయితే మరి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డుగా తయారవుతుంది
TV9 Telugu
ఇలా స్టవ్‌పై పేరుకున్న జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు సులభంగా పోవాలంటే ఏంచేయాలి.. అని ఆలోచిస్తున్నారా? అందుకు ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. వీటితో స్టవ్‌ని తళతళలాడిపోతుంది
TV9 Telugu
గ్యాస్ పొయ్యిని శుభ్రపరచడం చాలా కష్టమైన పని. స్టౌపై పేరుకుపోయిన నూనె, మురికి అంతత్వరగా వదలవు. గ్యాస్ బర్నర్స్ కూడా జిడ్డుతో నిండిపోతాయి. గ్యాస్ ఓవెన్ సరిగ్గా శుభ్రం చేయకపోతే, మంట బయటకు రాదు
TV9 Telugu
అందుకే వారానికి ఒక రోజు ప్రత్యేకంగా దీనిని శుభ్రం చేయాలి. గ్యాస్ బర్నర్లను సాధారణంగా డిష్ సబ్బుతో శుభ్రం చేస్తుంటాం. కానీ ఇలా చేసే కంటే.. కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక, స్పాంజ్‌ను అందులో ముంచి గ్యాస్ ఓవెన్‌ను బాగా తుడిస్తేసరి
TV9 Telugu
గ్యాస్ బర్నర్ లోపల వెనిగర్ చుక్కలు వేసి, కాసేపు అలాగే వదిలేయాలి. తర్వాత డిష్ వాష్ వేసుకుని స్పాంజితో తోమితే అన్ని జిడ్డు మరకలు తొలగిపోతాయి
TV9 Telugu
బేకింగ్ సోడాతో నిమ్మరసం లేదా వెనిగర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి ఒకసారి గ్యాస్ ఓవెన్, బర్నర్‌ను శుభ్రం చేస్తే తళతళలాడిపోతాయి
TV9 Telugu
నీటిని బాగా మరిగించి స్టవ్ కుక్‌టాప్‌పై పోయాలి. ఇలా పోసిన నీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత కాస్త డిష్‌వాషర్ లేదా ఏదైనా సోప్ వేసి స్క్రబ్బర్‌తో తోమితే సరి.. స్టవ్‌పై పేరుకుపోయిన జిడ్డు ఇట్టే వదిలిపోతుంది
TV9 Telugu
వేడి నీటిలో ఉప్పు వేసి, దానిలో బర్నర్లను ముంచి 15-20 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత సబ్బుతో కడగాలి. ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి.. మీ కళ్లను మీరే నమ్మలేరు