పచ్చిమిర్చీ ఇలా కట్‌చేస్తే చేతులు మంటెక్కవు!

30 September 2024

TV9 Telugu

TV9 Telugu

ముట్టుకుంటే మంట పుట్టించే పచ్చి మిర్చీ వంటల రుచిని రెట్టింపు చేస్తాయి. పచ్చి మిరపకాయ ప్రత్యేకత దాని ఘాటు ద్వారా మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది

TV9 Telugu

పచ్చి మిరపకాయలో అధిక మొత్తంలో ఉండే విటమిన్-సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

విటమిన్ సి , బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉన్నందున పచ్చి మిరపకాయ కళ్ళు , చర్మానికి చాలా ఉంటుంది. పచ్చి మిరపకాయను చల్లని , చీకటి ప్రదేశంలో ఉంచాలి. గాలి, కాంతికి గురికావడం దాని విటమిన్లు కోల్పోతాయి

TV9 Telugu

అయితే పచ్చి మిరపకాయలను కోయడానికి గృహిణులు తెగ హైరానా పడిపోతుంటారు. సాధారణ కూరగాయల మాదిరి వీటిని కూడా కట్‌ చేస్తే చేతులు మంటతో అల్లడిస్తాయి

TV9 Telugu

పచ్చిమిర్చి కట్‌ చేసిన చేతులు కారంగా ఉంటాయి. పొరపాటున ఈ చేతిని కళ్లను తాకితే కళ్లు మండుతాయి. వంటకు అవసరమైన ఈ పచ్చిమిర్చి కాయలను కోయడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు నిపుణులు

TV9 Telugu

ఈ ట్రిక్స్‌ సహాయంతో పచ్చి మిరపకాయలను సులభంగా కావలసిన ఆకారాల్లో కోసుకోవచ్చు. మూడు నుంచి నాలుగు పచ్చి మిరపకాయలను కటింగ్‌ బోర్డు మీద పట్టుకుని వీలైనంత సన్నగా కోసుకోవాలి

TV9 Telugu

అయితే వేళ్లు కాస్త దూరంగా పెట్టి కత్తిరించాలి. డిష్ రుచిని మెరుగుపరచడానికి బిర్యానీ వంటి రెసిపీలో పొడవాటి ముక్కలు చేసిన పచ్చి మిరపకాయలను ఉపయోగించవచ్చు

TV9 Telugu

ముందుగా వాటిని పొడవుగా కట్ చేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి మిరపకాయలను గుండ్రంగా కట్ చేసి గార్నిష్ చేయడానికి ఉపయోగించవచ్చు. వీలైనంత వరకు కటింగ్‌ బోర్డు ఉపయోగిస్తే చేతులు మంటెక్కవు