ఈ విటమిన్ లోపం ఉంటే జాగ్రత్త సుమా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం 

23 July 2024

TV9 Telugu

Pic credit - GETTY

కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన అవయవం. రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలు సహకరిస్తాయి. అంతేకాదు శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తాయి కూడా 

 మూత్రపిండాలు 

 ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల సమస్య చాలా ఎక్కువైంది. మూత్రపిండాల్లో రాళ్లకు అనేక కారణాలు ఉన్నాయి.. వాటిల్లో ఒక ప్రత్యేక కారణం విటమిన్ లోపం.

కిడ్నీలో రాళ్ల సమస్య

శరీరంలో విటమిన్ B6 లోపం ఉంటే ఒక రకమైన ఖనిజమైన ఆక్సలేట్ స్థాయి పెరుగుతుందని డాక్టర్ కవల్జిత్ సింగ్ చెప్పారు. కిడ్నీలు దానిని ఫిల్టర్ చేయలేవు. ఇది కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణం కావచ్చు.

ఏ విటమిన్ లోపం

మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి శరీరంలో విటమిన్ B6 లోపాన్ని భర్తీ చేయడం చాలా ముఖ్యం. ఈ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడానికి ఈ ఆహారాలను తినండి.

కిడ్నీ స్టోన్ నివారణ

శరీరంలో విటమిన్ బి6 లోపాన్ని తీర్చడానికి అరటిపండును తినవచ్చు. దీనిలో అధిక మొత్తంలో విటమిన్  B6 ఉంటుంది.

అరటిపండు

చేపల తినడం వలన కూడా శరీరంలో విటమిన్ B6 స్థాయిని పెగురుతుంది. తినే ఆహారంలో సాల్మన్ ఫిష్ తో పాటు ట్యూనా ఫిష్ ఉండేలా చూసుకోండి.

 చేపలు  

విటమిన్ బి6 లోపాన్ని అధిగమించడానికి బంగాళాదుంపలను కూడా తినవచ్చు. ఇందులో విటమిన్ బి6, సి, పొటాషియం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ముఖ్యమైనవి.

బంగాళదుంప