మీ బుజ్జాయిలో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే కిడ్నీ టెస్ట్ చేయించండి
19 August 2024
TV9 Telugu
TV9 Telugu
కిడ్నీ వ్యాధి పెద్దలకు మాత్రమే వస్తాయనుకుంటే పొరబాటే. వివిధ కారణాల వల్ల పిల్లలు కూడా మూత్రపిండ వ్యాధికి గురవుతుంటారు. కాబట్టి మీ చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి
TV9 Telugu
తరచుగా పిల్లలు మూత్రవిసర్జన చేయడం మంచి సంకేతం కాదు. మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి
TV9 Telugu
6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిలల్లు కూడా మంచం తడిపేస్తుంటారు. చాలామంది ఈ అలవాటును సాదారణమైనదిగా భావిస్తుంటారు. కానీ ఇది కూడా అనుమానించవల్సిన లక్షణమే
TV9 Telugu
అలాగే కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా చాక్లెట్లు ఎక్కువగా తింటే, దాని ప్రభావం పిల్లల దంతాల మీద పడుతుంది. చిగుళ్ళు త్వరగా పాడైపోతాయి
TV9 Telugu
అలాగే పిల్లలకు అప్పుడప్పుడు పొత్తి కడుపు నొప్పి, తరచుగా వాంతులు, వికారం, తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నట్లు మీరు గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి
TV9 Telugu
ఉబ్బరం, ఆకలి లేకపోవడం, తీవ్ర బలహీనత కూడా మూత్రపిండ వ్యాధికి సంకేతాలు. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లల్లో అధిక రక్తపోటు కూడా సంభవిస్తుంది
TV9 Telugu
పిల్లలలో మూత్రపిండ వ్యాధికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, డైపర్ల నుంచి మూత్రానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. రోజులో అధిక సార్లు మూత్రాన్ని ఆపుకున్నా.. అది మూత్రాశయంపై ఒత్తిడిని కలిగిస్తుంది
TV9 Telugu
పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. బదులుగా తగినంత నీరు తాగాలి. మూత్రం ఆపుకునే అలవాటు మానేయాలి. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం మానేయాలి. ప్రమాద నివారణకు వీటిల్లో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందే